కొత్త రేషన్ కార్డులతో పాటు వెంటనే ఆరోగ్యశ్రీ కార్డులు జారిచేయాలి...
కొత్త రేషన్ కార్డులతో పాటు వెంటనే ఆరోగ్యశ్రీ కార్డులు జారిచేయాలి...
కె.యం.నారాయణ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు..కొత్త రేషన్ కార్డులు జారీ చేయుటకు గవర్నమెంటు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కావునా వాటితో పాటుగా ఆరోగ్యశ్రీ కార్డులు వెంటనే జారీ చేయుటకు అదేశాలివ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ, గత ఏడేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ కార్డు లు ఇవ్వకుండా పేద ప్రజల ఆరోగ్యం తో చెలగాటం అడటమే కావునా వెంటనే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇచ్చి పేదలకు ఆరోగ్య పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున పేదల పక్షాన ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. పేదలు హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉన్నపుడు గ్రామ సర్పంచ్ గారి దగ్గర్నుండి ఎమ్మార్వో దగ్గర నుండి కలెక్టరేట్లో ఎమర్జెన్సీ ఆరోగ్య శ్రీ కార్డు ని తీసుకోవలసిన దుస్థితిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నైనా ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి బరోసానివ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కె.యం. నారాయణ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో TPCC organizing secretary రాములు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గారు, సంయుక్త కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి గారు,SC సెల్ ప్రెసిడెంట్ ఆశన్న గారు పాల్గొన్నారు.