కొంరెడ్డిపల్లి లో విజయవంతం అయిన రక్త దాన శిబిరం....

కొంరెడ్డిపల్లి లో విజయవంతం అయిన రక్త దాన శిబిరం....
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న , ప్రపంచ మేధావి డా౹౹ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం కొంరెడ్డిపల్లి లో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి రక్త దాన శిబిరం ప్రారంభం చేశారు. SVS హాస్పిటల్ మహబూబ్ నగర్ గారికి రక్త దానం చేయడం జరిగింది. ఈ రక్త దాన కార్యక్రమంలో మొత్తం 33 మంది సభ్యులు పాల్గొని బ్లెడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ రాధ, PACS డైరెక్టర్ జంగాళ్ల వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి రామ్ చంద్రయ్య, స్వేరో సర్కిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ రవాన్ స్వేరో, గ్రామ అధ్యక్షుడు కేశవులు, మలేకడి వెంకటయ్య, కూర్మయ్య, రాములు, వెంకట్ రాములు, దాస్, P. వెంకటయ్య, వెంకటేష్, అంజి, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.