కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ - మాజీ ఎమ్మెల్యే మల్లురవి....
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ - మాజీ ఎమ్మెల్యే మల్లురవి....
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి ఆధ్వర్యంలో 2 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ..భారతదేశానికి భవిష్యత్తులో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని, రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి వైపు నడుస్తదని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మల్లురవి పేర్కొన్నారు. శనివారం జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ రథసారథి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి ఆధ్వర్యంలో కరోనాతో ఇటీవల మరణించిన అనిల్ కుమార్, ప్రవీణ్ కుమార్ కుటుంబాలకు బియ్యము, నూనె ఇతర నిత్యావసర సరుకులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి ఉధృతం వేళా తమ అధినేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని నిడంబరంగా జరుపుకోవడం జరిగిందన్నారు. జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారికి పలు సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు భాస్కర్ గౌడ్, శ్రీకాంత్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.