కందూరు ఆలయ అభివృద్ధికి కృషి చేయండి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి..

కందూరు ఆలయ అభివృద్ధికి కృషి చేయండి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి...కందూరు శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నూతన పాలకవర్గం అభివృద్ధికి కృషిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు శుక్రవారం రోజు కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అడ్డాకుల మండలం ఎంపీపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  పాలక మండలి చైర్మన్ సభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేసి  ఆలయ అభివృద్ధికి తోడు పాటుపడాలని సూచించారు టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వాలు ఆలయ అభివృద్ధిని మర్చిపోయారని కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక ఆలయ అభివృద్ధి కి నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా కోనేరు దగ్గర మెట్ల నిర్మాణం కోసం ఎస్టిమేషన్ వేసి ఎంత ఖర్చు అవుతుందో డాక్యుమెంట్స్ అందజేస్తే మెట్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యేటట్టు చూస్తానని ఆయన అన్నారు. తదనంతరం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి డైరెక్టర్ లు శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ పాలకమండలి సభ్యులను పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు  ఈ కార్యక్రమంలో మూసాపేట జడ్పిటిసి ఇంద్రయ్య సాగర్ మండల పిఎసిఎస్ అధ్యక్షులు జితేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ రాధిక టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు ఆవుల సుజాత, స్థానిక ఎంపిటిసి శ్యామలమ్మ ప్రచార కార్యదర్శి జాజాల రాజేశ్వర్ రెడ్డి ,మాజీ ఎంపీపీ రామన్ గౌడ్ ఆలయ అధికారులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.