కళ్యాణ లక్ష్మి, చెక్కుల పంపిణీ చేసిన డిసిఎంఎస్ పట్ల ప్రభాకర్ రెడ్డి.....
కళ్యాణ లక్ష్మి, చెక్కుల పంపిణీ చేసిన డిసిఎంఎస్ పట్ల ప్రభాకర్ రెడ్డి.....
రాజాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వేదికపైన డీసీఎంఎస్ పట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడు సంవత్సరాలలో పుట్టబోయే బిడ్డ నుంచి చనిపోయిన తర్వాత కూడా పథకాలు ఉన్నాయని అన్నారు. అదేవిధంగా రాబోవు రెండు సంవత్సరాలలో మహబూబ్ నగర్ జిల్లా కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్ ల ద్వారా సస్యశ్యామలం కాబోతుందన్నారు.
అనంతం రైతుబంధు అధ్యక్షుడు నర్సింహులు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెన్షన్స్ 200 నుండి 2016/- రూపాయలకు పెంచడం, ఎకరాకు పది వేల రూపాయల రైతు బంధు, రైతు భీమ ద్వారా మరణిస్తే పది రోజుల లోపే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు, అందించడంతో పాటు కెసిఆర్ కిట్టు కల్యాణలక్ష్మి రైతుబంధు రైతు బీమా
మండలంలోని వివిధ గ్రామాల 27 మంది కళ్యాణ లక్ష్మి, లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,00,116/- రూపాయల చొప్పున మొత్తం 27,03,132 /- రూపాయలను డిసిఎంఎస్ పట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపిపి సుశీల రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, జెడ్పిటిసి మోహన్ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, రైతుబంధు అధ్యక్షులు అన్మగల్ల నర్సింలు, కో ఆప్షన్ సభ్యులు అల్తాఫ్ భేగ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, దొండ్లపల్లి ఎంపిటిసి అభిమన్యు రెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచుల సమక్షంలో లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పి.శంకర్ తోపాటు కార్యాలయ సిబ్బంది వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.