కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం లో భాగంగా 177 మంది లబ్ధిదారులకు సుమారు ఒక 1కోటి 77 లక్షల (1,77,20,532) రూపాయల విలువైన చెక్కులను అర్హులైన పేదలకు అందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్... జిల్లా కలెక్టర్ శ్రీ S. వెంకటరావు...

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ పట్టణము లోని తన క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం లో భాగంగా 177 మంది లబ్ధిదారులకు సుమారు ఒక 1కోటి 77 లక్షల (1,77,20,532) రూపాయల విలువైన చెక్కులను అర్హులైన పేదలకు జిల్లా కలెక్టర్ శ్రీ S. వెంకటరావు గారితో కలసి పంపిణీ చేశారు. వీటితోపాటు మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో 57 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 24 లక్షల 27 వేల రూపాయల విలువైన  చెక్కులను లబ్ధిదారులకు అందించారు. 

క్యాంప్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణ లక్ష్మీ - షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ రోజు సుమారు 2 కోట్ల రూపాయల విలువైన చెక్కులను మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు తన నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పేదలకు చెక్కులను పంపిణీ చేశారు.