జిల్లాలో ఈ నెల 6 నుండి గ్రామ గ్రామాన ఫీవర్ సర్వే లు...

జిల్లాలో ఈ నెల 6 నుండి  గ్రామ  గ్రామాన ఫీవర్ సర్వే లు...
సర్వే కు ప్రత్యేక బృందాల నియామకం- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు వెల్లడ   కోవిడ్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కు సిద్ధం చేశారు జిల్లా కలెక్టర్  ఎస్.వెంకట రావు. బుధవారం ఆయన కోవిడ్ పై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశ నిర్దేశం చేశారు.  పట్టణ ప్రాంతాలలో కోవిడ్ పర్యవేక్షణ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, గ్రామీణ ప్రాంతాల పర్యవేక్షణకు రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామరావులను నోడల్ అధికారులుగా జిల్లా కలెక్టర్ నియమించారు. మండల స్థాయిలో కోవిడ్ నియంత్రణ పర్యవేక్షణలో తాసిల్దార్ లు కీలక పాత్ర పోషించాలని ,ఇందుకు ఎంపీడీవోలు ,ఎంపీడీవోలు, మండల వైద్యాధికారులు సహకరించాలని ఆదేశించారు. కోవిడ్ నివారణలో భాగంగా ఈనెల 6 వ తేదీ నుండి అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో ఫీవర్ సర్వే నిర్వహించాలని, మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని, సర్వేలో అంగన్వాడీ, ఆశ పంచాయతీ కార్యదర్శులను పాల్గొనేలని, ప్రతి మండలంలో 3,4 సూపర్వైజరి బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.సర్వే లో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ కిట్ ఇవ్వాలని, మామూలు లక్షణాలు ఉన్నట్లయితే ఇంటివద్దే ఉంటూ చికిత్స తీసుకొనేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని, ఆక్సిజన్ అవసరమైన వారికి మాత్రమే ఆస్పత్రులకు రిఫర్ చేయాలని ఆదేశించారు. సర్వే లో జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు  కీలక పాత్ర పోషించాలని ఆదేశించారు.        గురువారం నుండే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో  కోవిడ్  ఓ పి ని ప్రారంభించాలని  ప్రతి కేసుకు కోవిడ్  పరిక్ష అవసరం లేదని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని డాక్టర్లు పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ప్రతి ఆరోగ్య కేంద్రం ఎదుట కోవిడ్ పై ఫ్లెక్సీ బ్యానర్ ఏర్పాటు చేయాలని చెప్పారు.ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే బాలనగర్, దేవరకద్ర, కోయిల్ కొండ లలో ఏర్పాటుచేసిన మినీ కోవిడ్  కేర్ సెంటర్లక పంపించాలని చెప్పారు..   ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడివోలు వారి పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లను పర్యవేక్షించాలని  .  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ప్రతి రోజు డి ఎం హెచ్ ఓ కు నివేదిక పంపాలని, అదేవిధంగా తాసిల్దార్లు కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.        కోవిడ్ విపత్కర పరిస్థితులలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని డాక్టర్లు  24 గంటలు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ,డాక్టర్లతో పాటు బాధ్యత కలిగిన ప్రతి అధికారి,కోవిడ్ లో పని చేసే సిబ్బంది ఎవరు సెలవు పెట్టవద్దని కోరారు.     కోవిడ్ వ్యాక్సినేషన్ దుర్వినియోగం కాకూడదని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ ఇవ్వాలని, పది మందికి మించి వచ్చినప్పుడు మాత్రమే వ్యాక్సిన్ వాయిల్స్ ను ఓపెన్ చేయాలని, తహసిల్దార్లు ,ఎంపీడీవోలు వ్యాక్సిన్పై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ,ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని  కలెక్టర్ అన్నారు, ఆక్సిజన్ సరఫరా  పై  ప్రతిరోజు ఆస్పత్రులకు వెళ్లి వారి పరిధిలోని ఆసుపత్రి తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పర్యవేక్షకునితో  పాటు,స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్ ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారని, బెడ్లు, ఆక్సిజన్, పారిశుద్ధ్యం ,డాక్టర్లు వంటి వాటిపై పూర్తి నివేదిక సమర్పిస్తున్నారని చెప్పారు.     జిల్లాలో ఉన్న అన్ని వైద్య కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ లో ఉన్న అందరూ వైద్య, పారామెడికల్ సిబ్బంది కోవిడ్  విధులు నిర్వహించాలని పునరుద్ఘాటించారు .
  జిల్లా అధికారులు సైతం వారికి కేటాయించిన వార్డులలో పర్యటించి కోవిడ్ లో ప్రజలకు మేమున్నామనే ధైర్యాన్ని కల్పించాలని అన్నారు.
 పట్టణాలు, గ్రామాలలో  కోవిడ్ వచ్చిన ప్రాంతాలలో  డిస్ఇన్ఫెక్షన్ తో పాటు, ఎక్కువ కేసులు వచ్చిన చోట మినీ కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మండల స్థాయి లో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని అవసరమైతే మినీ కంటోన్మెంట్ జోన్లు పెట్టాలని కలెక్టర్ సూచించారు.
ప్రజలు అవసరంగా బయటకు రాకుండా చూడాలని ,బయటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించేలా, శానిటైజర్ వేసుకునేలా, భౌతిక దూరం పాటించేలా చూడాలని చెప్పారు. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పెంపొందింప చేయాలని అని అన్నారు ..  అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మరో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ, మెడికల్ కళాశాల డైరెక్టర్  పుట్టశ్రీనివాస్, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రామ్ కిషన్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్, డి పిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, సునీత, భూత్పూర్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు తహసిల్దార్లు ,ఎంపీడీవోలు, ఎంపీవోలు, వైద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అంగన్వాడి సిడిపిఓలు ,సూపర్వైజర్లు తదితరులు హాజరయ్యారు .