జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.....
జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.....
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని కొమిరెడ్డి పల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ కు చుట్టుపక్కల వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, శారీరకంగా ఉల్లాసంగా ఉంటారని అన్నారు. ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి 25000, రెండో బహుమతి 12000 ఉన్నాయని నిర్వాహకులు వివరించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీ మాచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ మాధవి రాజ్ కుమార్ రెడ్డి , ఎంపీటీసీ రాధ అంజనేయులు, పి ఎ సి సి ఎస్ డైరెక్టర్ జంగళ్ల వెంకటయ్య, కారొబార్ వెంకటయ్య, బీజేపీ రాములు, బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, పాల్గొన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ కు ప్రతి ఒక్కరూ క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు వివరించారు.