జేఈఈ మెయిన్స్ పరీక్ష లో మెరిసిన ఏటీఆర్ హై స్కూల్ విద్యార్థి......
జేఈఈ మెయిన్స్ పరీక్ష లో మెరిసిన ఏటీఆర్ హై స్కూల్ విద్యార్థి......
ఇటీవల విడుదలైన జాతీయస్థాయి జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మహమ్మదాబాద్ ఏటీఆర్ పాఠశాలకు చెందిన అరవింద్ కుమార్ రెడ్డి99.35% స్కోర్ సాధించి జాతీయ స్థాయిలో నిలిచాడు ఈ సందర్భంగా ట్రస్మా నాయకులు విద్యార్థిని సోమవారంఏటిఆర్ పాఠశాలలో శాలువాతో ఘనంగాసన్మానించారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ అంజి రెడ్డి మాట్లాడుతూ తమపాఠశాలలో చదువుకున్నా కొమి రెడ్డిపల్లి కి చెందిన విద్యార్థి అరవింద్ కుమార్ రెడ్డి నర్సరీ నుండి పదవ తరగతి వరకు చదువుకున్న డని ఎటువంటి కోచింగ్ లేకుండా మొదటిప్రయత్నంలోనే జేఈఈ లో జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించడం పాఠశాలకి గర్వకారణమని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో రత్న లీగల్ అడ్వైజర్ ట్రస్మా లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది బెక్కం జనార్దన్ రెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, హన్వాడ మండల అధ్యక్షులు రాములు, పాఠశాల ఉపాధ్యాయ బృందం శివ కుమార్, బాల్రాజ్, లక్ష్మణ్, జిజిరాణి, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు