జడ్చర్ల పట్టణ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం. - ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి.. .

 జడ్చర్ల పట్టణ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం. - ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి.. .

జడ్చర్ల పట్టణంలోని క్లాబ్ ఏరియా, సరస్వతి నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి....జడ్చర్ల లో అభివృద్ధి తో పాటు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని తాలుకా క్లబ్ ఏరియా బ్లాక్ ఆఫీస్ వెనుకాల  మరియు సరస్వతి నగర్ కాలనిలో పర్యటించి సమస్యలను స్వయంగా పరిశీలించారు.  కాలనీలో గల సమస్యలను సీసీ రోడ్లు,డ్రైనేజి ,తాగునీటి పైపు లైన్ లను పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన వారందరికీ డబుల్ బేడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. రోడ్ల పై వెంటనే మొరం పోసి తాత్కాలికంగా ఇబ్బందులు తొలగించాలని తదుపరి సీసీ రోడ్లు వేయాలని ఆదేశించారు. గత పాలకులు నియోజకవర్గంలో ఏనాడూ పర్యటించ లేదని, ఈరోజు తాను ప్రతి కాలనీ లో ఎ చిన్న సమస్య వున్న వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటునమ్మని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి  తెలిపారు.