జడ్చర్ల పట్టణంలో ని అంబేద్కర్ చౌరస్తాలో జడ్చర్ల బిజెపి శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడి గారికి పాలాభిషేకం...
జడ్చర్ల పట్టణంలో ని అంబేద్కర్ చౌరస్తాలో జడ్చర్ల బిజెపి శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడి గారికి పాలాభిషేకం...
ఈరోజు జడ్చర్ల పట్టణంలో ని అంబేద్కర్ చౌరస్తాలో జడ్చర్ల బిజెపి శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా బిజేపి నాయకులు మాట్లాడుతూ..18 ఏళ్లు నిండిన దేశ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడం పట్ల భాజపా జడ్చర్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జడ్చర్ల ప్రజల తరఫున ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారు చేసుకోలేక పోతే రూ.లక్షల కోట్లు నష్టపోయే వాళ్లమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్రం తెలంగాణకు 80లక్షల డోసులు ఇచ్చిందన్నారు. జూన్లో 20, జులైలో 20లక్షల వ్యాక్సిన్ డోసులు తెలంగాణకు వచ్చే అవకాశముందన్నారు. మోదీ నిర్ణయం పట్ల పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు చెబుతుంటే కేసీఆర్ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఉచిత వ్యాక్సిన్ ఇస్తుందని కేసీఆర్ బాధపడుతున్నారని, అందుకే ప్రధానికి కృతజ్ఞతలు చెప్పలేదని ఆరోపించారు. కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని సూచించారు. కరోనా కట్టడికి రూ.2,500 కోట్లు కేటాయించానని సీఎం చెప్పారు.. ఆ నిధులు ఎక్కడిపోయాయని ప్రశ్నించారు. రూ.500 కోట్లు కేటాయిస్తే శాశ్వత వైద్యులు, సిబ్బందిని నియమించుకోవచ్చని సూచించారు. ఇప్పటికైనా వైద్యులు, సిబ్బంది నియామకానికి సీఎం చర్యలు చేపట్టాలని జడ్చర్ల బీజేపీ శాఖ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మధు, మండల అధ్యక్షులు నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ జి, 10వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి రాజు, సాహితీ రెడ్డి, వెంకట్, అనంత కిషన్, నరేష్, కొంగలి శ్రీకాంత్, శగ గోపాల్, బాలస్వామి, నాగరాజు, కుమార్, సునీల్, శేఖర్, జగదీష్, విష్ణు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.