జర్నలిస్టు ఏముల నర్సిములు మౌన దీక్ష...
జర్నలిస్టు ఏముల నర్సిములు మౌన దీక్ష... ఈనెల 9న గౌరవ మహబూబ్ నగర్ ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం గురుకుంటలో వార్తా సేకరణకు వెళ్లిన జర్నలిస్టులపై ఎంపీ అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ సీనియర్ జర్నలిస్టు ఏముల నర్సిములు బుధవారం ఉదయం 12గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు తన ఇంట్లో మౌన దీక్ష చేశారు. అంబేద్కర్ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళుర్పించారు. తనపై దాడికి పాల్పడిన దయాపంతులపల్లి కుమార్, గౌరవ ఎంపీటీసి అనిత భర్త ఎర్రోళ్ల శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. లేదా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో గౌరవ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆగడాలను, దౌర్జన్యాలను, భూ దందాలను వెలుగులోకి తెస్తానని తెలిపారు. తక్షణమే గౌరవ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకుని ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని, లేనిపక్షంలో జర్నలిస్టులపై టీఆర్ఎస్ కార్యకర్తల, నాయకుల ఆగడాలను, దౌర్జన్యాలు, భూతు పురాణం ఉదంతాలను
ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో పర్యటించి
అక్షరబద్ధం చేస్తానని, పుస్తకం వెలువరించి ప్రజల్లో చర్చకు పెడతానని వెల్లడించారు. ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ చట్టం రూపొందించాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితులలో నిరుపేద జర్నలిస్టులను గుర్తించి ఆర్థిక సాయం చేయాలని కోరారు.