జన్మదినోత్సవం సందర్భంగా సీఎం ఆశీస్సులు తీసుకున్న వాల్యా నాయక్

జన్మదినోత్సవం సందర్భంగా సీఎం ఆశీస్సులు తీసుకున్న వాల్యా నాయక్ 

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామావత్ వాల్యా నాయక్
తన 47వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుని శనివారం ప్రగతి భవన్ లో కలిసి ప్రత్యేక ఆశీస్సులు తీసుకున్నట్లు వెల్లడించారు. తన జన్మదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.