జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ....
జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ....
మంగళవారం మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం మండల అధ్యక్షుడు కావలి రామకృష్ణ మాట్లాడుతూ 1980 ఏప్రిల్ ఆరో తారీఖున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ జరిగిన శుభదినం చిరస్మరణీయమైనదని కొనియాడారు. రాజాపూర్ మండల కేంద్రంలో ని బీజేపీ పార్టీ కార్యాలయం ముందు ,పార్టీ జెండాను ,రాజాపూర్ మండల, బీజేపీ మండల అధ్యక్షుడు కావలి రామకృష్ణ ఏగరవేశారు.ఈ కార్యక్రమంలో ,జిల్లా నాయకులు పల్లె శేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ తక్కన పల్లి రాజు, మండల కార్యదర్శి రాజు, కోశాధికారి అల్లే మధు, ఆనంద్, గంగాధర్, వార్డ్ నెంబర్ నర్సింహ, యువ మోర్చా అధ్యక్షుడు ఆదిత్య,బొల్లం పల్లి రాకేష్, కన్నా, వెంకటేష్, రాము, ప్రభాస్, అంజి, సంతోష్ , బాలు తదితరులు పాల్గొన్నారు.