జల శక్తి అభియాన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ....
జల శక్తి అభియాన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ....వర్షపు నీటి సంరక్షణకు ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుండి జల శక్తి అభియాన్ పై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ మార్చి 22 నుండి నవంబర్ 30 వరకు అమలు చేయనున్న జల శక్తి అభియాన్ పథకం కింద ఎన్నో లాభాలు ఉన్నాయని, వర్షపు నీటిని సంరక్షించుకోవడం, వర్షపు నీటి ప్రాముఖ్యతను చాటి చెప్పే అంశాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలని, ఇందుకుగాను గ్రామాలలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. భూమి మీద పడిన ప్రతి వర్షపు నీటిని ఒడిసి పట్టుకొనేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ఈ పనులకు అన్ని శాఖల ద్వారా ఉపాధి హామీ నిధులు వినియోగించుకోనెల చూడాలని, వర్షపు నీటి సంరక్షణ ,వర్షపు నీటిని ఒడిసి పట్టడం, ఇంటి పై కప్పు పై కురిసిన వర్షపు నీటి సంరక్షణ పనులు, గ్రామాలలో పచ్చదనాన్ని పెంపొందించడం,వాన నీటి సంరక్షణ గుంటలు, చెక్ డ్యాములు, పాడుపడిన బావుల పూడికతీత,ఎండిపోయిన బోర్ల పునరుద్ధరణ, చెరువు శిఖం భూముల ఆక్రమణలను తొలగించుట, వాన నీటి సంరక్షణ వంటి కార్యక్రమాలను ఈ పథకం కింద చేపట్టవచని , ఇందుకుగాను ఆయా శాఖలు వారి శాఖ వారిగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గురువారం నాటికి అన్ని శాఖలు తమ సొంత ప్రణాళికలు రూపొందించి తనకు సమర్పించాలని ఆదేశించారు. దీనివల్ల వాన నీటి సంరక్షణ తో పాటు, కూలీలను వినియోగించుకొనే శాతం పెరుగుతుందని అన్నారు.
వాన నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై జిల్లాలోని అన్ని గ్రామాలు,పట్టణాలలో కళాశాలలు పాఠశాలల విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన చేయాలని , పోస్టర్లు, కరపత్రాలను ప్రచురించి అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు పంపించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, అదేవిధంగా లఘు చిత్రాన్ని కూడా రూపొందించాలని డి ఆర్ డి ఓ ను ఆదేశించారు. ఇది అత్యంత ముఖ్యమైన విషయంగా తీసుకొని ప్రతి 15 రోజులకొకసారి ఈ అంశంపై సమావేశం నిర్వహించి 15 రోజుల్లో సాధించిన ప్రగతి నివేదికలు డి ఆర్ డి ఓ కు పంపించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వీటితోపాటు , చెరువుల శిఖం భూములు ఆక్రమణకు గురైన ట్లయితే వాటిని తొలగించి చెరువు అభివృద్ధి కి చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై ప్రత్యేకించి రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ఇందుకుగాను వీలైతే ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారలు చర్చించాలని మున్సిపల్ కమిషనర్ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సమగ్ర ప్రణాళిక రూపొందించి చెరువులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు . కాగా ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ ,అటవీ, వ్యవసాయ, ఉద్యాన, పంచాయతీరాజ్, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు వర్షపునీటి సంరక్షణకు జల శక్తి అభియాన్ కింద చేపట్టనున్న పనులు, కార్యాచరణ ప్రణాళికలు, తీసుకోబోయే చర్యలపై జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,డి ఆర్ ఓ కే .స్వర్ణలత డిఆర్డిఓ యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటరమణ, నీటిపారుదల శాఖ ఈ ఈలు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుచరిత ,ఉద్యాన శాఖ డి డి సాయిబాబా, గ్రౌండ్ వాటర్ డి డి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు హాజరయ్యారు