జలసంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి దర్శి బచావో సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ ఆజాం

 జలసంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి 

దర్శి బచావో సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ ఆజాం 
ప్రకృతి మనుగడ  నీటితోనే కొనసాగుతోందని జీవవైవిధ్య పరిరక్షణ..జీవం జలంతోనే సాధ్యమవుతుంది కావున ప్రతి ఒక్కరు జలసంరక్షణకు కృషి దర్శి బస్సు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మొహమ్మద్ ఆజాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మల్దే శ్రీశైలంలు తెలిపారు. సోమవారం ధర్తీ బచావో సంస్థ ఆధ్వర్యాన కరపత్ర ఆవిష్కరణ సభలో  జరిగిన ప్రపంచ జల దినోత్సవ చైతన్య సదస్సులో వారు మాట్లాడుతూ.. నీటితో జీవం అంకురించిందని ప్రకృతి మనుగడ  నీటితోనే కొనసాగుతోందని జీవవైవిధ్య పరిరక్షణ..జీవం జలంతోనే సాధ్యమవుతుందని ఇవన్నీ తెలిసినా..నీటిని వృధా చేస్తున్నామని,ఇలాగే ఉంటే భవిష్యత్లో జల సంక్షోభం ఎర్పడే అవకాశం ఉన్నందున, అందరూ నీటిని పోదుపుగా వాడాలని పిలుపునిచ్చారు. సంస్థ వ్యవస్థాపకులు  మహ్మద్ ఆజమ్ మాట్లాడుతు 
భారత్‌లో సింధు నాగరికత, ఈజిప్టులో నైలు నది నాగరికత ఇలా ప్రపంచ నాగరికతలు నదీ తీరాలు, నీటి వనరులకు సమీప ప్రాంతంలో విలసిల్లాయని మన చరిత్రంతా జలవనరులతోనే ముడిపడి ఉందని, నీటిని పరిరక్షించుకోవాలనే నినాదాన్ని ఈ నాగరికతలు వెల్లడించాయని తెలుపుతు జలసంరక్షణ కోసం అందరూ కలసి కట్టుగా పని చేయాలని కోరారు.