జడ్చర్ల లో ఫనవిజయం సాధిస్తాం....బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు...డికె, అరుణ బిజెపి ఎన్నికల కార్యాలయం ప్రారంభం...

జడ్చర్ల లో ఫనవిజయం సాధిస్తాం....బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు...డికె, అరుణ
బిజెపి ఎన్నికల కార్యాలయం ప్రారంభం...

జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టి ఘన విజయం సాధిస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ ధీమా చేశారు. శనివారం జడ్చర్లలో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన  అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధిని విస్మరించారని ఆమె ఆరోపించారు. జడ్చర్లలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయని ఆమె విమర్శించారు. వంద పడకల ఆసుపత్రి ఇప్పటివరకు ఒక రూపు దాల్చుకోలేదని రహదారులు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆమె అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు ఓ కొలిక్కి రాలేదని పట్టణంలో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదని అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. టిఆర్ఎస్ నాయకుల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోయిందని ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి చైర్ పర్సన్ తో పాటు అత్యధిక కౌన్సిలర్ స్థానాలను అప్పగించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్, స్థానిక నాయకులు రా పోతుల శ్రీనివాస్ గౌడ్, మధు,వెంకట్రామ్ రెడ్డి,కరాటే శీను, పరుసవేది ,అనిల్ ,సునీల్ తదితరులు పాల్గొన్నారు.