జడ్చర్లలో భారీ చోరీ 50 తులాల బంగారం, కిలో వెండి, 5 లక్షల నగదు అపహరణ
జడ్చర్లలో భారీ చోరీ
50 తులాల బంగారం, కిలో వెండి, 5 లక్షల నగదు అపహరణ
పట్టణంలోని నడిబొడ్డున బుధవారం తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ తో పట్టణంలోని ప్రజలు పోలీసులు హతాశులయ్యారు. నేతాజీ చౌరస్తా కు కూతవేటు దూరంలో ఉన్న మిర్యాల వేణుగోపాల్ అనే వ్యాపారి నివాసంలో దొంగలు చొరబడి బీభత్సం సృష్టించారు. సీఐ వీరస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున వేణుగోపాల్ ఇంటి వెనుక భాగంలో ఉన్న మెట్ల ద్వారా తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొరబడిన దొంగలు ఇంట్లోని సామాను మొత్తం చిందరవందర చేశార ని అన్నారు. అందినకాడికి బంగారం, వెండి ఆభరణాలు నగదును దోచుకెళ్లిన టు సిఐ వీరస్వామి పేర్కొన్నారు. బాధితుడు మిర్యాల వేణుగోపాల్ తులాల బంగారం కిలో వెండి ఐదు లక్షల రూపాయల నగదు పోగొట్టుకున్నట్లు పోలీసులకు తెలిపినట్లు వివరించారు. అదేవిధంగా పట్టణంలోని క్లబ్ రోడ్డు శ్రీనివాస నగర్ కాలనీ లలో దొంగలు చోరీకి పాల్పడ్డారని తెలిపారు. శ్రీనివాస నగర్ లోని శివ అనే టీచర్ నివాసంలో చొరబడి 8 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లిన టు అదేవిధంగా ఆయన వివరించారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు.