జడ్చర్లకు చెందిన చిక్కా హరీష్ కుమార్ తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొందారు.
జడ్చర్లకు చెందిన చిక్కా హరీష్ కుమార్ తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య కె. ఆనందన్ పర్యవేక్షణలో చిక్కా హరీష్ కుమార్ "వికలాంగుల సాహిత్యం - సామాజిక చైతన్యం" అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేశారు. ఇంతకుముందే హరీష్ "అంధుల వెలుగుప్రదాత లూయిస్ బ్రెయిలీ (జీవిత చరిత్ర)", "నేనైతే వికలాంగున్నే (కవితా సంపుటి)" రచనలు వెల్లడించారు. అంతేకాకుండా "మేము సైతం" అనే కథా సంకలనానికి సహసంపాదకత్వం వహించారు. అనేక రచనలు పలుపత్రికలలో ముద్రితమయ్యాయి. అనేక తెలుగు సెమినార్లలో పత్రసమర్పణలు చేశారు. వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో వికలాంగుల సాహిత్యంపై మొట్టమొదటి సారిగా హరీష్ కుమార్ పిహెచ్.డి చేయడం గమనార్హం. చిక్కా హరీష్ కుమార్ కు డాక్టరేట్ పట్టా లభించడం పట్ల పాలమూరు సాహితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ బోగ కోదండపాణి, అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుంటి గోపి ఆదివారం పత్రిక ప్రకటనలో అభినందనలు తెలిపారు.