జడ్చర్ల లోని విజయనగర్ కాలనీలో రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడిన మణి గండ్ల విజయ్ కుమార్ ను శనివారం పట్టణం లో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట హాజరుపరిచారు
జడ్చర్ల లోని విజయనగర్ కాలనీలో రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడిన మణి గండ్ల విజయ్ కుమార్ ను శనివారం పట్టణం లో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట హాజరుపరిచారు. అందుకుసంబందించిన వివరాలను డీఎస్పీ శ్రీధర్ మీడియా కు వెల్లడించారు. విజయ్ కుమార్ 2009 నుంచి పలు నేరాలకు పాల్పడుతూ జైలు జీవితం అనుభవించి నట్లు తెలిపారు. డిసెంబర్ 3వ తేదీన విడుదలైన విజయ్ కుమార్ పలు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఇప్పటివరకు విజయ్ కుమార్ పై 45 కేసులు నమోదైనట్లు వివరించారు. సిద్దిపేట జిల్లా రాఘవపూర్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీ లో నివాసం ఉంటూ చోరీలకపాల్పడుతున్నాడని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో 45 కే సులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం వాహనాల ఉదయం 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా విజయ్ కుమార్ ఫింగర్ ప్రింట్ తీసుకోగా ఇతని పై ఉన్న పాత కేసులు తెలియడం జరిగిందని విచారించగా జడ్చర్లలో చోరీకి పాల్పడినట్లు నిందితుడు చెప్పినట్టుగా డీఎస్పీ పేర్కొన్నారు నిన్ను టిఫిన్ వద్ద నుండి 7.2 తులాల బంగారు ఆభరణాలు, 44 తులాల వెండి ఆభరణాలతో పాటు, ఒక ఎల్ఈడి టీవీ ని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివరించారు నిందితులను గుర్తించి పట్టుకున్న ఎస్సై జయప్రసాద్, కానిస్టేబుల్ శంకర్, బాలచంద్రుడు, శ్రీనివాసులు,చైతన్య కుమార్ ల ను ఈ సందర్భంగా అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో సిఐ వీరస్వామి, ఎస్సై శంషోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.