జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసాం .. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావు ...

జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కి వివరించారు .
శనివారం రాష్ట్ర ఎన్నికల  కమిషనర్ పి.పార్థసారథి హైదరాబాద్ నుండి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు,మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ సందర్భంగా  జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలకు  ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ కమిషనర్ కు  వివరిస్తూ, ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేయనున్న పోలీస్ బందోబస్తు పై జిల్లా ఎస్ పితో కలిసి ముందస్తు ప్రణాళిక రూపొందించామని, ఈ నెల 23న  జడ్చర్ల పట్టణంలో ఎన్నికల పంపిణీ కేంద్రం, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించడం జరిగిందని, పోస్టల్ బ్యాలెట్  కు సంబంధించి ఇదివరకే విస్తృత ప్రచారం నిర్వహించామని తెలిపారు. ఈ నెల 25 నుండి రెండు రోజుల్లో ఓటర్ చీటీ ల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా నిర్వహించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
 అంతకు ముందు జిల్లా ఎస్ పి.ఆర్ వెంకటేశ్వర్లు జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల సందర్బంగా ఏర్పాటు చేయనున్న పోలీస్ బందోబస్తు తదితర విషయాలను కమిషనర్ కు వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ పోలింగ్ రోజున ఎలాంటి  కోవిడ్ కేసులు నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని,  అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తగినన్ని మాస్కులు ఏర్పాటు చేయాలని," నో మాస్క్ నో ఓటు "పాలసీని అమలు చేయాలని, ప్రజలు తప్పనిసరిగా మాస్కుతో పోలింగ్ కేంద్రానికి వచ్చేలా అవగాహన కల్పించాలని,సిబ్బంది కూడా తప్పనిసరిగా మాస్కుతో పాటు, ఫేస్ మాస్క్  ధరించి విధులు నిర్వహించాలని తెలిపారు. జోనల్ అధికారులు, ఎస్ ఎస్ టి బృందాలకు మెజిస్టీరియల్ పవర్స,ప్రతి సున్నిత  పోలింగ్ కేంద్రం లో సీసీ కెమెరాల ఏర్పాటు , ఓట్ల లెక్కింపు లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని, పోలింగ్ సిబ్బంది, బందోబస్తు కోసం నియమించబడిన పోలీసులను తీసుకువెళ్లేందుకు  కోవిడ్ దృష్టిలో ఉంచుకొని సరిపోయినన్ని వాహనాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేదించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దివ్యాంగులు, 80 సంవత్సరాల పైబడిన వారితో పాటు,కోవిడ్ పాజిటివ్ వచ్చిన రోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని ,ఈ విషయాన్ని ముందే విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. ఇందుకుగాను పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన చెప్పారు. ముఖ్యంగా.  దివ్యంగులకు సంబంధించి మూడు చక్రాల బళ్లు ,వాలంటీర్లను నియమించాలని ,పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలైన తాగునీరు ఏర్పాటు చేయాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసేఅధికారం ఉందని ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్ కు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ల ను నియమించాలని, ప్రతి రోజూ మోడల్ కోడ్ పై నివేదికలు పంపించాలని, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో ఎన్నికలను  నిర్వహించాలని ఆయన తెలిపారు.గతంలో మాదిరి కాకుండా ఈ ఎన్నికలలో ప్రచార గడువు పోలింగ్ కు  72 గంటల ముందే   ముగుస్తుందని,ఈనెల 27 సాయంత్రం 5 గంటల నుండి  అభ్యర్థులు ఏలాంటి ప్రచారం నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలలో ఓటు వేసే ఓటర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటేషన్ వేసుకోవాలని తెలిపారు .కౌంటింగ్ పై ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ గతంలో మాదిరి కాకుండా  ఈ సారి 5 టేబుల్లు మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. కౌంటింగ్ కోసం ఉపయోగించే టేబులు, కుర్చీలు, ఇతర సామాగ్రిని ముందే డిస్ ఇన్ఫెక్షన్ చేయాలని, అదేవిధంగా ఫర్నిచర్ను ముందుగా నుండే డిస్ ఇన్ఫెక్షన్ చేయించాలని తెలిపారు.మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని అదనపు డీజీపీ జితేందర్ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి  ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అవసరం అయితే ఇంకా ఎక్కువ మంది పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేస్తామని, కోవిడ్ వేగంగా విస్తరిస్తున్నందున ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎస్పీలు 5 నుండి 10 శాతం సిబ్బందిని రిజర్వులో ఉంచుకోవాలని ఆయన తెలిపారు.