జడ్చర్ల అభివృద్ధే లక్ష్యం. - ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి ....

జడ్చర్ల అభివృద్ధే లక్ష్యం. - ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి ....
అర్హులు అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తాం. - ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని గ్రామ చావిడి, జవహర్ నగర్, కావేరమ్మ పేట పలు కాలనీ లో పర్యటించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ..జడ్చర్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తాన లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక పాతబజార్ గ్రామ చావిడి, జవహర్ నగర్, కావేరమ్మ పేట కాలనీలలో పర్యటించి  సమస్యలను స్వయంగా పరిశీలించారు. కాలనీ లోని సీసీ రోడ్లు, డ్రైనేజీ, మిషన్ భగీరథ తాగునీటి పైపు లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశించారు. అనంతరం జడ్చర్ల లో నిర్మితమువుతున్న ట్యాంక్ బండ్ ను ఎమ్మెల్యే గారు పరిశీలించారు.