హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి టిఆర్ఎస్ ఎస్.వాణి దేవి గెలుపు

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి టిఆర్ఎస్ ఎస్.వాణి దేవి గెలుపు ఆనందంలో సంబరాలు జరుపుకున్నా ముఖ్యనేతల పార్టీ కార్యకర్తల
రెండు వారాల క్రితం అసలు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి టీఆర్ఎస్ అసలు పోటీలో ఉంటుందా అనే దశ నుండి ఇవ్వాళ కౌంటింగ్ లో ప్రతి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి ఎస్ వాణీ దేవి ఆధిక్యం ప్రదర్శిస్తూ గెలుపొందారు.రాజాపూర్ ముఖ్య కూడలిలో బాణసంచా పేల్చి రంగులు చల్లుకుని ఆనంద ములో తేలియాడారు
ఈ సందర్భంగా గా సర్పంచ్ బచ్చి రెడ్డి రైతుబంధు అధ్యక్షుడు హన్మ గళ్ళ నర్సిములు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ వీరు మాట్లాడుతూముఖ్యమంత్రి కేసీఆర్ చాణక్యం తో అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి సహకారంతో మంచి ఫలితం చూపింది. కొత్త అభ్యర్థి అయినా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ, మరో మాజీ ఎమ్మెల్సీ ఇద్దరినీ తోసి తొలి స్థానంలో నిలిచిన ఎస్ వాణీ దేవి.
 
గత రెండు వారాలుగా టీఆర్ఎస్ నాయకత్వం పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచి, ప్రత్యర్థులకు గట్టి జవాబులు ఇస్తూ, చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఉద్యోగులకు, విధ్యావంతులకు  చాలా చక్కగా చెపుతు ప్రచారం చేసింది.
 
దుబ్బాక, జిహెచ్ఎంసి తో పోలిస్తే చాలా గట్టి ప్రయత్నం చేసింది టి.ఆర్.ఎస్ పార్టీ కాబట్టే రిజల్ట్ ఇలా పాజిటివ్ గా వచ్చింది.
 

ఈ కార్యక్రమంలో  మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి నరహరి, ఉపాధ్యక్షులు రాచమల్ల యాదయ్య, ఏఎంసి డైరెక్టర్ వనపర్తి దేవేందర్ కో ఆప్షన్ నెంబర్ అల్తాఫ్, ఉపసర్పంచ్ అల్లె శ్రీను, సభవట్ రవి, కిషన్,ఆనంద్ గౌడ్, విజయ్, అచ్చయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.