హై రిస్క్ గ్రూప్ వారికిచ్చే వ్యాక్సిన్ కార్యక్రమం జిల్లాలో శరవేగంగానడుస్తుంది ... జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు...

 హై రిస్క్ గ్రూప్ వారికిచ్చే వ్యాక్సిన్ కార్యక్రమం జిల్లాలో శరవేగంగా నడుస్తున్నదని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు. గురువారం ఆయన అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఎక్స్పో ప్లాజాలో  హై రిస్క్ గ్రూప్ వారికి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిన్నటి వరకు పట్టణంలో హై రిస్క్ కేటగిరీ వారికోసం మూడు వాక్సినేషన్  కేంద్రాలను ఏర్పాటు చేశామని, అయితే వ్యాక్సినేషన్ తీసుకునే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుండి మరో 3 కేంద్రాలను పెంచినట్లు కలెక్టర్ వెల్లడించారు. అదేవిధంగా ఇప్పటివరకు  ప్రతిరోజు  650 మందికి  వాక్సిన్ ఇస్తున్నామని, అయితే ఈ లక్ష్యాన్ని 1150 కి పెంచినట్లు చెప్పారు.  హైరిస్క్ గ్రూపు వారు వ్యాక్సినేషన్ ను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.  వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కోవిడ్ పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్ వేసుకోవడం ,భౌతిక దూరాన్ని పాటించడమే కాకుండా తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ ,డెమో తిరుపతిరావు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు .