రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా హరిత తెలంగాణను సాధించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలకు నీరు పోసి సంరక్షించాల్సిన అవసరం ఉంది ... జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా హరిత తెలంగాణను సాధించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలకు నీరు పోసి సంరక్షించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. ప్రతి శుక్రవారం మొక్కలకు నీరు అందించే కార్యక్రమం లో భాగంగా జిల్లా కలెక్టర్ ఈ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మొక్కలకు నీరు పోశారు. వేసవిలో మొక్కలు చనిపోకుండా సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పల్లె ప్రకృతి వనాలు, రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు, హరిత వనాలు ,మంకీ ఫుడ్ కోర్ట్స్ , ఆయా సంస్థల లో నాటిన మొక్కల కు తప్పనిసరిగా నీరు పోయాలని అన్నారు. దీని ద్వారా హరిత తెలంగాణ సాధించేందుకు, మంచి భవిష్యత్తును పొందేందుకు ఇది చక్కటి అవకాశమని కలెక్టర్ తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్లు ,తేజస్ నందలాల్ పవర్ జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు మొక్కలకు నీరు పోశారు.