GTN పరిశ్రమ ఉద్యోగులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి వినతి.....

GTN పరిశ్రమ ఉద్యోగులు 
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి వినతి.....మండల పరిధిలోని గుండ్ల పొట్లపల్లి గ్రామ శివారులో గల GTN పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు తమకు సరైన విధంగా ఎక్సుగ్రేషియా చెల్లించాలని

 శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి వినతి పత్రం అందజేశారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల తో సమానంగా తమకు కూడా  ఎక్సుగ్రేషియా చెల్లించాలని ఎమ్మెల్యే కు విన్నవించారు. గత ఇరవై సంవత్సరాలకు పైగా అదే పరిశ్రమలో పని చేస్తూ వస్తున్నామని, ప్రస్తుతం పరిశ్రమ మూతపడుతున్న విషయమై పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు ఒకరకంగా ఎక్స్ గ్రేషియా, తమకు ఒక రకంగా ఎక్సుగ్రేషియాను చెల్లించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పరిశ్రమకు చెందిన ఉద్యోగులు పేర్కొన్నారు. పరిశ్రమలో పని చేస్తున్న ప్రతి ఒక్కరిని సమానంగా చూడాల్సిన బాధ్యత పరిశ్రమ యాజమాన్యానికి ఉందని, ఒకరికి ఒక న్యాయం,  మరొకరికి ఒక న్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని, ఇలాంటి ధోరణీని పరిశ్రమ యాజమాన్యం వెనక్కు తీసుకోవాలని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు, జుడిషియల్ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారికి, gtn పరిశ్రమ యూనియన్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి కి విన్నవించిన ట్లు ఉద్యోగులు పేర్కొన్నారు. పరిశ్రమ యాజమాన్యం తమకు సరైన న్యాయం చేయకపోతే తాము అందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు వెనుకాడేది లేదని పరిశ్రమకు చెందిన ఆంజనేయులు, కరుణాకర్ గౌడు, యాదగిరి, గోవిందప్ప, నర్సింహులు, కుమారస్వామి, రహీం, నర్సింలు పేర్కొన్నారు.