GTN కార్మికుల జీవితాలు తాకట్టు పెట్టిన గుర్తింపు సంఘం నాయకులు....

GTN కార్మికుల జీవితాలు తాకట్టు పెట్టిన గుర్తింపు సంఘం నాయకులు....
కార్మికుల అభిప్రాయాలు తీసుకోకుండా జనరల్ బాడీ నిర్వహించకుండా యాజమాన్యానికి అమ్ముడు పోయి చట్ట వ్యతిరేక ఒప్పందం చేసి కార్మికుల నడ్డి విరిచారు కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్.మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం గుండ్ల పోట్ల పల్లి గ్రామంలో గల GTN ఇంజనీరింగ్(ఇండియా) లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యం చట్ట వ్యతిరేకంగా ఏప్రిల్ 10 వ తేదీన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కంపెనీ మూసివేసిందని. 
ఎన్నికల్లో గెలిచిన మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి కార్మికులను నమ్మించి పోరాడుతా అని పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చి సంవత్సరానికి 74 వెలు అడిగినం, చర్చలు జరుగుతున్నాయి.అని వాట్స్ యాప్ ల్లో మసేజెలు పెట్టారని.కానీ రెండు నెలలు గా జీతాలు ఇప్పించకుండా, కార్మికుల అభిప్రాయాలు తీసుకోకుండా, ఏక పక్షంగా చట్ట వ్యతిరేకంగా యాజమాన్యం తో కుమ్మకై  ఇప్పుడు సంవత్సరానికి 21000/- కి ఒప్పందం చేసి గొప్పగా చెప్పుకోవటం సిగ్గు చేటు అని కార్మికులను మోసం చేసిన సంఘం నాయకులు కార్మికులకు సమాధానం చెప్పాలని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ డిమాండ్ చేశారు.