గ్రామీణ కార్మిక ఉద్యమ పిత బాబు జగ్జీవన్ రామ్....

గ్రామీణ కార్మిక ఉద్యమ పిత బాబు జగ్జీవన్ రామ్.... జగ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలను సోమవారంనాడు మహబూబ్నగర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ డి .ప్రదీప్ కుమార్ పూలమాలవేసి జయంతిని నిర్వహించారు. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, జగ్జీవన్రామ్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త మరియు అంటరాని వారికి సమానత్వం సాధించడానికి అంకితం భావంతో "ఆల్ ఇండియా డిప్రెషన్ లీగ్ అనే సంస్థను స్థాపించారని గుర్తు చేశారు. గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని కూడా ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఇంజినీర్లు, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.