గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట ....

గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట ....బాలానగర్ మారుమూల  గ్రామ పంచాయతీలలో, తండాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి గిరిజన తండా గ్రామ పంచాయతీల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని టిఆర్ఎస్ నాయకులు జగన్ నాయక్,  తిరుమలగిరి గ్రామ సర్పంచ్ లు  పేర్కొన్నారు. బుధవారం తిరుమలగిరి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ నిధుల నుండి ఆరు లక్షల రూపాయలతో నూతనంగా సి సి రోడ్డు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని,  కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి అభివృద్ధిని చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.