ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం ...
ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం ...సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఏ రాములు ప్రపంచవ్యాప్తంగా కార్మిక పోరాటాలకు స్ఫూర్తిగా ఎర్రజెండా నిలుస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఏ రాములు అన్నారు. శనివారం ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని మిడ్జిల్ మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో పార్టీ జెండాను ఆయన ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1886 సంవత్సరం చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని పాలకుల స్వార్థ రాజకీయాల కోసం కార్మికులు ఈ దేశ ఆర్థిక ప్రగతి ముందుకు వెళ్లాలంటే మళ్లీ 12 నుంచి 18 గంటలు పనిచేయాలని స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పటం సిగ్గుచేటైన విషయమని ఆయ అన్నారు. ఈ దేశ ఆర్థిక ప్రగతి కోసం బడా కార్పొరేట్లకు సొమ్ము చేసే విధంగా ఉందని దీనివల్ల కార్మికుల యొక్క పని భారం పెరిగి వారి యొక్క శ్రమను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను నాలుగు భాగాలుగా విభజించి కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. ఈ దేశంలో ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎయిర్ లైన్స్ రైల్వే విశాఖ ఉక్కు తదితర కర్మాగారాలను ప్రైవేటీకరణ చేసి విదేశ పెట్టుబడిదారులకు దాసోహం చేసే విధంగా ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు ప్రభుత్వం తీసుకు వచ్చిన నల్ల రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కనీస వేతనాలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీనికోసం కార్మిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రెడ్డి శంకర్ నాయక్ ఆనంద్ బంగారు జంగయ్య భాస్కర్ గౌడ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు