ఘనంగా ఎంపీపీ సుశీల రమేష్ నాయక్ జన్మదిన వేడుకలు...

ఘనంగా ఎంపీపీ సుశీల రమేష్ నాయక్ జన్మదిన వేడుకలు... 

రాజాపూర్ మండల ఎంపీపీ సుశీల రమేష్ నాయక్  జన్మదిన వేడుకలు శుక్రవారం రాజాపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య కూడలిలో  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీఎంఎస్ పట్ల ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, హజరై ఎంపీపీని శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
 
అనంతరం ఎంపీపీ సుశీల రమేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను మండల ఎంపిపిగా ఎన్నుకున్న ప్రజలకు ఎల్లవేళల నేను అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి మరియు పార్టీ అభివృద్ధికి నా వంతు సహకారాన్ని అందిస్తానని అదే విధంగా నాకు వెన్నంటి ఉండి నిత్యము నాకు సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి, డిసిఎంఎస్ పట్ల ప్రభాకర్ రెడ్డికి, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులకు నా భర్త రమేష్ నాయక్ మరియు నేను ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ పట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు, జెడ్పిటిసి మోహన్ నాయక్, వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు ఆన్మగల్ల నర్సింలు, కో ఆప్షన్ సభ్యులు అల్తాఫ్ భేగ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, దొండ్లపల్లి ఎంపిటిసి చించోడ్ అభిమన్యు రెడ్డి, ఉపసర్పంచ్ అల్లె శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, ప్రధాన కార్యదర్శి నరహరి, ఉపాధ్యక్షులు రాచమల్ల యాదగిరి, విజయ్, శ్రీను, గోవింద్ నాయక్, రవి నాయక్ వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు  పాల్గొన్నారు.
 
ఇక్కడ నుండి బయటదేరి ఎంపీడీవో కార్యాలయంలోని తన చాంబర్లో వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, అభిమన్యు రెడ్డితో పాటు ముదిరెడ్డిపల్లి ఎంపిటిసి శేఖర్ గౌడ్, తిర్మలాపూర్  సంతోష్, హతి రాం నాయక్, కో ఆప్షన్ సభ్యులు అల్తాఫ్  శాలువాలు కప్పి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం మండల విలేకరులు ఎంపిపి సుశీల రమేష్ నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం స్కూల్లో పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటుచేసిన సన్మాన సభలో పాల్గొన్నారు. అక్కడ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు మరియు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో లక్ష్మీదేవి, వెంకట్ రాములు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని పూలమాలలు శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
తాహసిల్దార్ శంకర్, ఎంపీపీ కి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.