ఘనంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు....
ఘనంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.... మండలం లో ఉన్న వివేకానంద చౌరస్తాలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శశికళ భీ 0 రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోయిలకొండ మండలాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేశారు. కోయిలకొండ మండలానికి ఎమ్మెల్యే సేవలు మరింత ఉపయోగపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో, వైస్ ఎంపీపీ పారుపల్లి కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కోయిలకొండ ఎంపిటిసి ఆంజనేయులు, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ వర్ధన్ రెడ్డి , జావిద్, మల్లయ్య యాదవ్ , లక్కీ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.