ఘనంగా మేడే కార్మిక దినోత్సవం సంబరాలు..

ఘనంగా మేడే కార్మిక దినోత్సవం సంబరాలు...మండల కేంద్రంలో అలాగే సల్కర్ పేట్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు సి ఐ టి యు ఆధ్వర్యంలో మేడే జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు  నాయకులు మాట్లాడుతూ కార్మికులను 19వ శతాబ్దంలో బానిసలుగా చూసేవారు. పని గంటలు 12  నుండి 18 వరకు ఉండేవి. దానికి ప్రతీకగా 1886 వ సంవత్సరం. అమెరికాలోని చికాగో నగరంలోని హే మార్కెట్లో మూడు లక్షల కార్మికులతో కార్మిక చట్టాల కోసం ఉద్యమo చేయడం జరిగింది. దీనికి పెత్తందారులు సహించలేక బాంబు కూడా పేల్చడం జరిగింది. ఈ సంఘటనలో ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కార్మిక చట్టాలు బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించరు. లింగ వివక్ష లేకుండా సమాన పనికి సమాన వేతనం మరియు రక్షణ మొదలగు అవకాశాలు కల్పించారని తెలిపారు. ఈకార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా సహాయ కార్యదర్శి పకిరయ్య, గ్రామ కార్మికుల సంఘం అధ్యక్షుడు గిరిమోని వెంకటయ్య, సల్కేర్ పెట్ సర్పంచ్ జితేందర్ రెడ్డి, ఎం పి టి సి వెంకటేశం, స్థానిక మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య,ఉషన్న, జి. మొగులయ్య, జి. వెంకటయ్య, బసయ్య ఉపసర్పంచ్, బి. మొగులయ్య,చెన్నయ్య, ఆశన్న, లింగం, వెంకటయ్య, చిన్నయ్య, దానయ్య, కనకమ్మ, అంజిలమ్మ, తదితరులు పాల్గొన్నారు