ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు...

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు...                                                  కోయిలకొండమండల కేంద్రమైన కోయిలకొండ లో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయం ముందు ఉన్న డాక్టర్ బి.ఆర్ .అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ శశికళ, జడ్పిటిసి విజయభాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, ఎమ్మార్వో  ప్రకాష్, ఎంపీడీవో రాఘవ, జిల్లా టీఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పి. నాగేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దేశానికి అందించిన సేవలు ప్రశంసనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో, ఎంపీవో అహ్మద్ , ఆర్ఐ కర్ణ య్య, ఎం పి టి సి అంజనేయులు, జగన్ గౌడ్, మొగులయ్య, రమేష్ , నర్సింలు తదితరులు పాల్గొన్నారు.