ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించిన తెలంగాణ మాలమహానాడు నాయకులు....
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించిన తెలంగాణ మాలమహానాడు నాయకులు....
ముఖ్యఅతిథిగా SCDD ఉపసంచాలకులు పెరిక యాదయ్య
DD పెరిక యాదయ్య, HWO జట్టి శివకుమార్ లను ఘనంగా సన్మానించారు
అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి - DD పెరిక యాదయ్య
అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శప్రాయుడు - మంత్రి నర్సింహ్మయ్య
తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తా లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన SCDD ఉపసంచాలకులు పెరిక యాదయ్య గారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా SCDD ఉపసంచాలకులు పెరిక యాదయ్య గారిని, గ్రేడ్-1 HWO పదోన్నతి పొందిన జెడ్ పి శివకుమార్ గార్లను తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా SCDD ఉప సంచాలకులు పెరిక యాదయ్య మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి దశ దిశ నిర్దేశించిన మహానుభావుడని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించి పేద బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపిన దేవుడు అంబేద్కర్ అని తెలిపారు. ఆయన జన్మదినాన్ని ఐక్యరాజ్యసమితి జ్ఞాన దినంగా ప్రకటించడం, యావత్ ప్రపంచం ఆయన జన్మదిన వేడుకలు చేయడం సంతోషంగా ఉంది అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ గారుఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆ మహానుభావుడు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కొంతమంది అంబేద్కర్ వ్యతిరేకులు ఆయనను ఒక వర్గానికే నాయకుడిగా గుర్తించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికీ దళితుల మీద అంబేద్కర్ వాదుల మీద అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటే నిర్మించుకో లేని మతోన్మాదులు అంబేద్కర్ విగ్రహాల మీద దాడి చేయడం దారుణమన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ ను తొలగించే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రైవేటీకరణ చేయడం అన్నారు. మతోన్మాద బీజేపీ శక్తులను తరిమి కొట్టాలన్నారు. ఆ మహానుభావుడు కల్పించిన రిజర్వేషన్లను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. మహానుభావునికి నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశయాలను కొనసాగించడంమే అన్నారు. ఏ జాతి అయితే రాజకీయ శక్తిగా ఎదిగిందో ఆ జాతి నశిస్తుందని అంబేద్కర్ గారు అన్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల అంతా ఏకమై రాజ్యాధికారం సాధించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాడం బాలరాజ్,రాష్ట్ర కార్యదర్శి మిట్టమీది బాలరాజ్, అంబేద్కర్ జాతర నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, సినీ నటులు దేవరాజ్, పట్టణ అధ్యక్షుడు గోకమల అంజయ్య, ధన్వాడ మండల అధ్యక్షులు గుంత లక్ష్మయ్య, మంత్రి యాదయ్య,నేరడి వెంకటేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.