అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం..! ఘనంగా అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలు..!!

అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం..!
ఘనంగా అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలు..!!-బ్యాగరి వెంకటస్వామి, టియంయం రాష్ట్ర అధికార ప్రతినిధి.మహబూబ్ నగర్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి- బ్యాగరి వెంకటస్వామి గారు మాట్లాడుతూ ....
 ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా, భారత పౌరులందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ... అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం అన్నారు. ప్రతీ ఒక్కరూ అంబేడ్కర్ గారి ఆశయాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో:- జిల్లా అధ్యక్షులు- పారుపల్లి శేఖర్, ప్రధాన కార్యదర్శి- మిట్టమీది- నాగరాజు. జిల్లా సలహాదారులు- కె. శంకర్ బాబు. జిల్లా కోశాధికారి- వాల్తాటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు