ఘనంగా ఆల నరేంద్ర 7 వర్ధంతి .....

ఘనంగా ఆల నరేంద్ర 7 వర్ధంతి మిడ్జిల్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో  ఆలె నరేంద్ర వర్ధంతి సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి ఎన్.రాజేశ్వర్ రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి మాట్లాడుతూ హిందుత్వమే ఊపిరిగా, కాషాయమే ప్రాణంగా,పాతబస్తీ అరాచక శక్తుల పాలిట సింహస్వప్నమైన మన తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ  నరేంద్ర  భారతీయ జనతా పార్టీ స్థాపించిన నాటి నుండి తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం...కార్యకర్తల శ్రేయస్సుకోరి అండదండలుగా నిలిచన గొప్ప నాయకులు హిమాయత్ నగర్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ ప్రజల గొంతుకను అసెంబ్లీలో విన్పించారు...పూర్వపు మెదక్ ప్రస్తుత జహీరాబాద్  పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ తరపున గెలుపొంది ఈ ప్రాంత అభివృద్ధికి విశేషమైన సేవలు అందించారు.కేంద్ర మాజీ మంత్రివర్యులు గా పని చేసిన కార్యకర్తల శ్రేయోభిలాషి వారు.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతాల బాట లోనే తన తుదిశ్వాస వరకు కాషాయమే ఊపిరిగా బ్రతికారు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్,మండల  నాయకులు విష్ణు భాయ్,కుమ్మరి రాములు,  పల్లె శ్రీను, భాస్కర్ నాయక్ పట్నం శంకర్,అరవింద్  బలరాం, రాజేశ్, శ్రీను, సంజీవ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు