గేట్ 2021 పరీక్షలో మెరిసిన పి.యు.విద్యార్థి మధు.
గేట్ 2021 పరీక్షలో మెరిసిన పి.యు.విద్యార్థి మధు. పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఎం.ఎస్సి ఐదవ సంవత్సర ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ విద్యార్థికి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2021 పరీక్షలో అర్హత సాధించాడు. విద్యార్థి మధు 4369ర్యాంకు సాధించి అర్హత పొందాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పవన్ కుమార్ మరియు ఓఎస్డీ డా: మధుసూదన్ రెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా: ఎం. నూర్జహాన్, డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి కె. రామ్మోహన్ మరియు సిబ్బంది డా: కె.శ్రీధర్ రెడ్డి ,ఎస్ . ఆయేషా హస్మి, రవికుమార్, సిద్ధి రామ గౌడ్ విద్యార్థి మధును అభినందించారు.