గంగాపూర్ లో స్వచ్ఛందంగా లాక్ డౌన్....

గంగాపూర్ లో స్వచ్ఛందంగా లాక్ డౌన్.... 

జడ్చర్ల రూరల్, మేజర్ న్యూస్, మండలంలోని గంగాపూర్ గ్రామంలో వ్యాపారస్తులుస్తులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకున్నారు. గ్రామంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వాటిని నివారించేందుకు వ్యాపారస్తులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమ వంతుగా 5వ తేదీ నుండి  25వ తేదీ వరకు గ్రామంలో  లాక్ డౌన్ విధిస్తామని అందుకు అంగీకరించాలని సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించారు. దీంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో లాక్ డౌన్   విధించినట్లు గ్రామ సర్పంచ్ స్పష్టం చేశారు. గ్రామస్తులంతా తమ ఇళ్లలోనే ఉండి లాక్ డౌన్ సక్సెస్ అయ్యేందుకు తమ వంతు సహకారం అందించాలని సర్పంచ్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.