మహబూబ్ నగర్ జిల్లాకు కోటి 27 లక్షల 43 వేల 674 నిధులు విడుదల

 కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాకు కోటి 27 లక్షల 43 వేల 674 రూపాయలను మంజూరు చేస్తూ నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్  ద్వారా ఈ నెల 16  న  ఉత్తర్వులుజారి అయినట్లు చెప్పారు.2016-17 నుండి 2020- 21  సంవత్సరాలకు సంబంధించి విడుదల చేసిన ఈ బడ్జెట్ లో 2016-17 నుండి 2018-19 సంవత్సరాలకు సంబంధించి పెండింగులో ఉన్న ధరకాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేదించినట్లు ఆయన తెలిపారు.  

       పై బడ్జెట్ లో జిల్లాకు బిసి కేటగిరీ కింద కోటి 19 లక్షల 74 వేల 443 రూపాయలు, ఈ బిసి కేటగిరీ కింద 7 లక్షల 69 వేల231 రూపాయలు, మొత్తం కోటి 27 లక్షల 43 వేల 674 రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు