ఇతర మంత్రుల పై వచ్చిన ఆరోపణలు సంగతేంటి, ముఖ్యమంత్రి ..
గత రెండు రోజులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు చేస్తూ అతనిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ తెరాస పార్టీ లో నుండి పొమ్మనలేక పొగపెడుతున్న కెసిఆర్ అని మండల కేంద్రంలోని మండల కేంద్రంలో. మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో బీసీ సేన నాయకుల సమావేశంలో బీసీసేన, జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ మండల అధ్యక్షులు మండ్ల స్వామి మాట్లాడుతూ కెసిఆర్ కావాలనే తన కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అడ్డుగా ఉన్న తెరాస పార్టీ సీనియర్ నాయకులు ముక్కుసూటి మనిషి బడుగు బలహీన వర్గాల నాయకులు ఈటెల రాజేందర్ పై ఒక ప్లాన్ ప్రకారమే కుట్ర చేస్తున్న కెసిఆర్ నీ అగ్రకుల అహం కారం బైట పడింది రెడ్డి రావు లకు ఒక న్యాయం బీసీ నాయకులుకు ఒక న్యాయమా నిన్ను పలుమార్లు ఎదురించినందుకే ఈటల పై కెసిఆర్ కుట్ర పన్నారు అని అన్నారు ఈటెల రాజేందర్ పై కుట్ర చేస్తే బీసీ వర్గాల వారు కెసిఆర్ నిన్ను బొంద పెడుతారు అని అన్నారు నువ్వు నిజంగా అవినీతి చేసే నాయకులను సహించకుంటే మిగతా రెడ్డి నాయకులు అయిన మంత్రి మల్ల రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి తదితరుల పై ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు ఈటెల రాజేందర్ పై చేస్తున్న కుట్రలను తీవ్రంగా కండిస్తున్నట్లు తెలిపారు భవిష్యత్ లో SC, ST, BC వర్గాల ప్రజలు రాజ్యాధికారం సాధించాలని ఈ అగ్రకులాల నాయకులు బహుజనులు వారికన్నా ఎక్కువుగా రాజకీయంగా ఎదిగితే సహించలేరని అన్నారు బహుజన రాజ్యాధికారం సాధించి ఈఅగ్రకుల నాయకుల ఆటలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు ఈటెల రాజేందర్ నిజమైన తెలంగాణ ఉద్యమ కారుడని ఆంధ్ర దోపిడి పాలకులను నిలాదీసిన గొప్ప నాయకుడి పై ఇలాంటి కుట్రలు చేయడం తెలంగాణ సమాజం సహించదని కెసిఆర్ కు తెలంగాణ ప్రజలు తగిన బుద్ది తొందరలోనే చెపుతారని అన్నారు ఈ సమావేశంలో బీసీసేన మండ్ల స్వామి , నసిరుద్దీన్, గౌరీ శంకర్, శివ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు