ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రిని చేస్తాం...
ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రిని చేస్తాం...
ప్రగతి భవన్ స్క్రిప్టు ప్రకారమే ఈటలపై మంత్రుల విమర్శలు
మైకుముందు మాట...మనసులోని మాట... ఒక్కటేనా మంత్రులారా...?
మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా గన్ పార్కులో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీసీ సంఘం నాయకులు.. ఈటల నాయకత్వంలోనే గడీల పాలన అంతమొందిస్తాం..బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్
బహుజనులంతా ఏకమై దొరల గడీల పాలనను అంతమొందించి ఈటల రాజేందర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోదకుమార్ తదితరులు ఈటల రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం అసెంబ్లీ ముందున్న గన్ పార్కులో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, సీఎం,మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం రాచాల మాట్లాడుతూ ప్రగతి భవన్ స్ర్కిప్టు ప్రకారమే ఈటలపై మంత్రులు విమర్శలు చేశారని, మాట్లాడేముందు కొంచెం ఆలోచించుకోవాలని హితవుపలికారు.
మంత్రి గంగుల కమలాకర్ గురించి రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసని, ముందు ఆయన మీద వున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాలన్నారు.
టీఆర్ఎస్ బలంతోనే ఈటల గెలిచారు తప్ప స్వంత బలంతో కాదని వినోదకుమార్ మాట్లాడారని, పార్టీ బలం అంతుంటే కరీంనగర్ లో ఎంపీగా ఎందుకు గెలవలేదో సమాధానం చెప్పాలన్నారు.
సీఎం ఈటల అనే నినాదాలు తట్టుకోలేకపోతున్నామని నాయకులు మాట్లాడుతున్నారని, అరశాతం ఉన్న మీరు ముఖ్యమంత్రి, మంత్రులుగా పాలిస్తుంటే యాభై శాతానికి పైగా ఉన్న మేమెలా మిమ్మల్ని భరించాలో చెప్పాలన్నారు.
ఈటలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన కూడా రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఏకం చేసి ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నాయకులు శశికుమార్ గౌడ్, నాయకులు మహేష్ కుమార్ ,విజయ్ ముదిరాజ్, శివ, మ్యాదరి రాజు తదితరులు పాల్గొన్నారు.