ఈటెల రాజేందర్ పై ఆరోపణలు సరికాదు....

ఈటెల రాజేందర్ పై ఆరోపణలు సరికాదు....

మంత్రి ఈటల రాజేందర్ పై టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు సరికాదని ముదిరాజుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విషయంలో ఈటల రాజేందర్ చురుకైన పాత్ర పోషిస్తూ తెలంగాణ కోసం పాటుపడిన ఆయన అక్రమాలపై పాటుపడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అనడం సరికాదన్నారు. తెలంగాణలో బిసి ఓట్లను వాడుకొని నేడు బీసీ వర్గానికి చెందిన ఈటెల పై అక్రమ కేసులు పెట్టి ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ నాయకులు అంతా ఏకమై తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. ఈటెల పై స్పందించి తిరిగి మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ నాయకులు జి రవీందర్. వేణు. రామకృష్ణ. నారాయణ . సంజీవ్. వెంకటయ్య. జగన్ .  సత్య వీరన్న . రాజు . పెంటయ్య . బాలకృష్ణ. నారాయణ. శ్రీకాంత్. ఆంజనేయులు. తదితరులు పాల్గొన్నారు