ఈటెల ఎదుగుదలను చూసి ఓర్వలేకే కక్షపూరిత చర్యలు...

 ఈటెల  ఎదుగుదలను చూసి   ఓర్వలేకే  కక్షపూరిత చర్యలు... 

 తెలంగాణ సబ్బండ ప్రజల అభిమాని ఈటెల రాజేందర్ పై ఎలాంటి ఆధారాలు లేకున్నా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కక్షపూరిత చర్యలు చేపట్టారని ముదిరాజ్ సంఘం నాయకులు ఎడ్ల శంకర్ పల్లె తిరుపతి అన్నారు మంత్రివర్గంలో అనేక మంది పై ఆరోపణలు వచ్చినా కేవలం బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం తగదని వారు హెచ్చరించారు మిడ్జిల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు ఈటల రాజేందర్ ముదిరాజ్ కు మద్దతుగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు జై ఈటల జై జై ఈటెల జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు . ఈ కార్యక్రమంలో పల్లె తిరుపతి, శంకర్, రాగుల రమేష్, శివరాజ్, లాలూ, రవి, శేఖర్, రాజు, శ్రీను, గణేష్, రాఘవేందర్, బలస్వామి, శ్రీను రామకృష్ణ నాగార్జున రవి నరేష్ శివ బంగారు శేఖర్ ముదిరాజ్ బంధుమిత్రులు  పాల్గొన్నారు