ఇసుక మాఫియాను....అడ్డుకుంటాం....సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్...

ఇసుక మాఫియాను....అడ్డుకుంటాం....సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్... మహబూబ్ నగర్ జిల్లా సి.సి. కుంట మండలంలో ఇసుక మాఫియా మళ్ళీ రెచ్చిపోతుంది. ఇసుక మాఫియాకు ఒకవైపు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అటువైపు రెవిన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారు. దింతో ఇసుక మాఫియా 3 టిప్పర్లు.....6 ట్రాక్టర్లు అన్న చందంగా సి.సి.కుంట మండలంలో యథేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా తరలిస్తుంది. ఇదిలాఉంటె ఇసుక మాఫియాను అడ్డుకోవడమే కాకుండా.....ఒత్తిళ్లకు లొంగకుండా.... ఇసుక మాఫియా అక్రమంగా తరలిస్తున్న 3 టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి.... తాను ఇసుక మాఫియాను అరికడతానే సంకేతాలు పంపి....గతంలో ఉన్న పోలీసులకు, తనకు చాలా తేడా ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసి శభాష్..... సి.సి.కుంట పోలీస్ అనేవిదంగా వ్యవరిస్తున్నారు సి.సి.కుంటకు కొత్తగా వచ్చిన ఎస్ఐ భాగ్యాలక్మరెడ్డి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి......మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో ఇసుక మాఫియా మళ్లీ, మళ్ళీ రెచ్చిపోతున్న....అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవిన్యూ అధికారులు మాత్రం  తమకేమీ పట్టనట్టుగా, తాపీగా చోద్యం చూస్తున్నారు. గతంలో ఇసుక మాఫియాకు స్థానిక పోలీసులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అంతేకాకుండా గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఎస్ఐ ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తున్నదనే నేపధ్యంలో ఆయనను అక్కడినుండి తొలగించి, జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె బుధవారం తెల్లవారుజామున సి.సి. కుంట మండల పరిధిలోని చిన్న వడ్డేమాన్ సమీపంలో గల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యామ్ వద్ద ఉన్న ఇసుకను ఇసుక మాఫియా అక్రమంగా తరలిస్తున్న 3 భారత్ బెంజ్ లారీలను సి.సి.కుంట ఎస్ఐ భాగ్యాలక్మరెడ్డి పట్టుకొని, పోలీస్ స్టేషన్ తరలించారు.