ఎన్నికల సందర్భంగా కోవిడ్ ను దృష్టిలో ఉంచుకుని మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేసింది

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా కోవిడ్  ను దృష్టిలో ఉంచుకుని మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం  విస్తృత ఏర్పాట్లను చేసింది. ఇందులో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో( 10 ) N- 95  మాస్కులతో పాటు, (10) గాగుల్స్,( 2)  శానిటైజర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎవరైనా ఓటరు  మాస్కు లేకుండా ఓటు వేసేందుకు వచ్చినట్లయితే వారికి కూడా మాస్కు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టారు.కోవిడ్  నిబంధనలు తప్పని సరిగా  పాటించేలా జిల్లా కలెక్టర్  ఎస్.వెంకటరావు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కృష్ణ ను నోడల్ అధికారిగా నియమించారు . ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించేలా అవగాహన కల్పించటంతో పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద ఇందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని  ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుగానే ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసిన రోజే సిబ్బందికి  సాని టైజర్లు,మాస్కులు,గాగుల్స్ ఇవ్వడం జరిగింది .ప్రత్యేకంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సిబ్బందిలో ఇద్దరిని నియమించడం జరిగింది.ప్రతి ఒక్కరు  మాస్కు ధరించటంతో పాటు,సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం  గేటు వద్ద సాని టైజర్ వేయడంతోపాటు మాస్కు ఉంటేనే లోపలికి అనుమతి ఇచ్చేలా జిల్లా కలెక్టర్ ముందే ఎన్నికల సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించడం జరిగింది.