దేవరకద్రలో బీసీ జెండా ఎగరేస్తాం
దేవరకద్రలో బీసీ జెండా ఎగరేస్తాం అడ్డాకులలో మండల స్థాయి పదవులన్నీ ఒకే సామాజికవర్గానికేనా? బీసీలంటే లెక్కలేదా...?
అడ్డాకులను రెడ్డాకులగా మార్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే వైఖరిపై మండిపడ్డ రాచాల
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గంలో బీసీ జెండా ఎగరేసి బీసీల సత్తా చాటుతామని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని మాతృశ్రీ పాఠశాలలో బీసీ సంక్షేమ సంఘం దేవరకద్ర నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాచాల యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ దేవరకద్రనియోజకవర్గంలోబీసీలనురాజకీయంగాఅడుగడుగునాఅణచివేస్తున్నారని, ఇది అడ్డాకులలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు.అడ్డాకులలో ఎంపీపీ, జెడ్పిటిసి, సింగిల్విండో అధ్యక్షులు, రైతుబంధు అధ్యక్షులు ఇలా అన్ని మండల స్థాయి పదవులన్నీ ఒకే సామాజికవర్గానికి కట్టబెట్టారని మండిపడ్డారు.
స్థానిక ఎమ్మెల్యే బీసీలపై కపట చూపుతున్నారని, నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే ఇన్ని కీలక పదవుల్లో బీసీలకు ఒక్కటికూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
బీసీలు ఓట్లు వేయడానికేనా... అధికార పదవులకు పనికిరారా అంటూ తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే వైఖరిపై ధ్వజమెత్తారు.
గతంలో బీసీలకు అడ్డాగా ఉన్న అడ్డాకులను ఆల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక రెడ్డాకులగా మార్చారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను విస్మరిస్తోందని, రాష్ట్రంలో బీసీ రుణాల కోసం దాదాపు 5.75 లక్షల మంది మంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులైన వారికి వెంటనే రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రతి ఎన్నిక సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని హడావుడి చేసే కేసీఆర్ నేటికి విడుదల చేయకపోగా మళ్ళీ నిరుద్యోగులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం మంత్రులకు తగదన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న1.91 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అభివృద్ధి పేరిట బీసీల భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని, బీసీల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల కన్వీనర్ ఆంజనేయులు సాగర్, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు భీమన్న నాయుడు, కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, కాటవరం శేఖర్ గౌడ్, బలిజ రవి, రమేష్ , వివిధ గ్రామాలకు చెందిన బీసీలు పెద్దఎత్తున పాల్గొన్నారు.