ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం....

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం....
మండలంలోని పెద్ద ఆదిరాల  కోడుగల్ గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య బుధవారం  ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన దాన్యాన్ని స్థానికంగానే విక్రయించుకునేందుకు ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. గతంలో ఇలాంటి ప్రయోగం చేసి ప్రభుత్వం  సత్ఫలితాలు సాధించిందని అందువల్లనే ఈ సంవత్సరం కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని అని తెలిపారు. రైతులు ఇతర ప్రాంతాలాలకు వెళ్లి నష్టపోకూడదని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  పిఎసిఎస్  అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ జంగయ్య లతోపాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.