దేవుడిపై భక్తితో హనుమాన్ దేవాలయానికి ఉడత సాయం...
దేవుడిపై భక్తితో హనుమాన్ దేవాలయానికి ఉడత సాయం...
తమ వివాహ వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా.. గ్రామ హనుమాన్ దేవాలయ నిర్మాణానికి తనవంతు ఆర్థిక సహకారంకు శ్రీకారం చుట్టారు ఓ దంపతులు. వివరాల్లోకి వెళితే రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన మొండి శివకుమార్ - హారికలు తమ పెళ్లి రోజు సందర్భంగా జీవితంలో ఒక తియ్యని మధురానుభూతిగా మిగిలెందుకు పదివేల రూపాయలను స్థానికంగా నూతన నిర్మాణంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి అందజేసినట్లు దంపతులు శివ కుమార్, హరిక లు తెలిపారు. ఆధ్యాత్మికంగాఅందంగా ముస్తాబవుతున్న రాజాపూర్ హనుమాన్ దేవాలయ నిర్మాణం ఇప్పటికే ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారని.. త్వరితగతిన పూర్తవుతుందని ప్రజలకు గ్రామస్తులకు.ఈ దేవాలయం ఎంతో ఆనందాన్ని అనుభూతిని ఇస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు వనపర్తి కృష్ణయ్య, కోశాధికారి గుమ్మడవెల్లి అచ్చయ్య, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు వాసరాము, కుమ్మరి వెంకటేష్ ఉన్నారు.