దేవాలయ భూములను,వక్ఫ్ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వదిలి పేటం.... రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్....
దేవాలయ భూములను,వక్ఫ్ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వదిలిపెట్టమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.మంగళవారం మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యులుగా నియమించబడిన అన్వర్ పాషను మంత్రి అభినందించారు. నూతనంగా నియమించబడిన వక్ఫ్ బోర్డ్ సభ్యులు అన్వర్ పాషా స్థానిక కౌన్సిలర్ల సహకారంతో జిల్లాలోని వక్ఫ్ భూములను గుర్తించి వాటికి రక్షణ కల్పించాలని, నెలకు ఒక రోజు ఈ విషయంపై సమావేశమై చర్చించాలని, 15 సూత్రాల మైనారిటీ కార్యక్రమంలో కూడా వక్ఫ్ భూములపై చర్చించాల్సిన అవసరం ఉందని, జిల్లాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్ని భూములు ఉన్నాయో అవన్నీ ఒక రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామరావు , మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు, వక్ఫ్ బోర్డ్ సభ్యులు అన్వర్ పాషా ,తకి తదితరులు ఉన్నారు.